• facebook
  • whatsapp
  • telegram

Reservations: నర్సింగ్‌ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలి

* కాళోజీ వర్సిటీని కోరుతున్న విద్యార్థులు

 

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: కాళోజీ విశ్వవిద్యాలయ పరిధిలో నర్సింగ్‌ కోర్సుల ప్రవేశాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లు అమలుచేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే వర్సిటీలో ఇతర కోర్సుల సీట్ల భర్తీలో వీటిని అమలుచేస్తుండగా నర్సింగ్‌లో చేయడం లేదన్నారు. వర్సిటీ పరిధిలోని 77 నర్సింగ్‌ కళాశాలల్లో 4230, 16 బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కళాశాలల్లో 850, 20 ల్యాబ్‌ టెక్నాలజీ కళాశాలల్లో 685 అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లున్నాయి. వీటిలో చేరడానికి గడువు అక్టోబ‌రు  3తో ముగుస్తుంది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలుచేస్తే పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయంపై రిజిస్ట్రార్‌ డా.ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా తమకు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నుంచి ఈ రిజర్వేషన్లపై ఉత్తర్వులు లేనందున అమలు చేయలేమన్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కనుమరుగవుతున్న లంకలు

‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా

‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.