• facebook
  • whatsapp
  • telegram

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహణపై పరిశీలన

ఈనాడు, అమరావతి: రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించడంపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షను రద్దు చేసిన అధికారులు అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు కేటాయించారు. ఎక్కువ మందికి 10/10 పాయింట్లు వస్తే మార్కుల ఆధారంగా ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించడం కష్టమని అధికారులు పేర్కొంటున్నారు. గ్రేడ్‌ పాయింట్లు 10/10 ఎక్కువ మందికి వస్తే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. పదో తరగతి ఫలితాల అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది పదో తరగతి విద్యార్థులకు మార్కులు కేటాయించకపోవడంతో ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేశారు.   

Posted Date : 05-08-2021