• facebook
  • whatsapp
  • telegram

అంబేడ్కర్‌ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

 

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువు తేదీని ఆలస్యం రుసుంతో పొడిగిస్తున్నట్లు వర్సిటీ అధికారులు అక్టోబరు 13న  తెలిపారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీలతోపాటు పీజీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుం రూ.200తో అక్టోబరు 20 వరకు గడువు పొడిగించామన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం తదితర వివరాలను www.braouonline.in  లో పరిశీలించాలన్నారు. మరిన్ని వివరాలకు 7382929570/580 నంబర్లలోగానీ, విశ్వవిద్యాలయ సహాయ కేంద్రం 040-23680290/291/294/295 నంబర్లలోగానీ సంప్రదించాలన్నారు. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఎస్‌ఎస్‌సీ - 3261 (ఫేజ్‌ - 1X) సెలక్షన్‌ పోస్టులు

‣ ఎన్‌వీఎస్‌ - జేఎన్‌వీల్లో ఆరో తరగతి ప్రవేశాలు

‣ ఆర్‌ఆర్‌సీ, నార్తర్న్‌ రైల్వేలో 3093 అప్రెంటిస్‌లు

మార్పులపై ఆచితూచి ముందడుగు

ఇంటర్వ్యూకు వెళుతున్నారా?

Posted Date : 13-10-2021