• facebook
  • whatsapp
  • telegram

Face Attendance: ఉన్నత విద్యా సంస్థల్లో ముఖ ఆధారిత హాజరు  

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్య సంస్థలో విద్యార్థులకు ముఖ ఆధారిత హాజరు నమోదును ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ హాజరు నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ సంస్థకు అప్పగించనున్నారు. నిర్వహణ కోసం విద్యార్థుల నుంచి కొంత మొత్తం వసూలు చేయనున్నారు. విద్యార్థుల హాజరుతో బోధన రుసుముల చెల్లింపును అనుసంధానం చేస్తారు. కనీసం 75 శాతం హాజరు ఉంటేనే బోధన రుసుములను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం విద్యార్థుల హాజరు కళాశాలలే వేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే అధ్యాపకులు తమ సెల్‌ఫోన్లలో హాజరు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తరగతిలోని విద్యార్థులను ఫోన్‌లో ఫొటో తీసి, అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కృత్రిమ మేధ ద్వారా విద్యార్థుల హాజరును గుర్తిస్తారు. మొదట విద్యార్థుల ఫొటోలను తీసి, సర్వర్‌లో ఉంచుతారు. ఆ తర్వాత అధ్యాపకులు తీసి పంపే ఫొటోలను సర్వర్‌లోని ఫొటోలతో సరిపోల్చి చూస్తారు. దీని ప్రకారం హాజరు నమోదవుతుంది. రాష్ట్రంలో డిగ్రీ మూడేళ్లు కలిపి 4.50 లక్షలు, ఇంజినీరింగ్‌లో 4 లక్షలు, పీజీలో 2 లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ముఖ ఆధారిత విధానంలోనే హాజరు వేయనున్నారు.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!

‣ అగ్రికల్చర్‌ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ డేటాసైన్స్‌ ఉద్యోగాలకు డిమాండ్‌!

‣ దిల్లీలో హెడ్‌కానిస్టేబుల్‌ కొలువులు

‣ ఆతిథ్య రంగంలో అవకాశాలు అనేకం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.