• facebook
  • whatsapp
  • telegram

Merging of Schools: తరగతుల విలీనంపై మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన  

ఈనాడు, అమరావతి: పాఠశాలల విలీనంపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. జిల్లా సంయుక్త కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయలేదనే ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5; ప్రాథమికోన్నత బడుల నుంచి 6, 7, 8 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంలో స్థానికంగా ఉన్న ఇబ్బందులపై 70 మంది ఎమ్మెల్యేలు లేఖలు సమర్పించారు. 820 పాఠశాలలపై అభ్యంతరాలు తెలిపారు. వీటిల్లో సుమారు 420 అభ్యంతరాల్లో కాలనీలు, గ్రామాల నుంచి పాఠశాలలను తరలించొద్దని పేర్కొన్నారు. మరో 400 చోట్ల విలీనం కారణంగా విద్యార్థులు జాతీయ, ప్రధాన రహదారులు, వాగులు, వంకలు దాటి వెళ్లాల్సి వస్తోందని, కిలోమీటరు కంటే దూరం ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఎమ్మెల్యేల అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపేందుకు సంయుక్త కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు నివేదికలు సమర్పించాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ సంయుక్త కలెక్టర్‌ క్షేత్రస్థాయి పర్యటన చేయకుండానే మండల విద్యాధికారుల ద్వారా నివేదికను పంపినట్లు విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మరోసారి అన్ని జిల్లాల్లోనూ పకడ్బందీగా పరిశీలనలు చేయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆదేశాలను ఒకటి, రెండు రోజుల్లో జారీ చేయనుంది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.