• facebook
  • whatsapp
  • telegram

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో 1.5 లక్షల సీజనల్‌ ఉద్యోగాలు

ఈనాడు, హైదరాబాద్‌: పండగల గిరాకీని దృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్తంగా కొత్తగా 66 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. దీంతోపాటు కొత్తగా 1.5లక్షల సీజనల్‌ ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంది. కిరాణా దుకాణాలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు, 1,000 కిపైగా డెలివరీ హబ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించింది. తెలంగాణతోపాటు, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో గత నాలుగైదు నెలలుగా ఈ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌లో రుణ పరిమితిని రూ.70వేలకు పెంచినట్లు ఫిన్‌టెక్‌ పేమెంట్స్‌ గ్రూపు హెడ్‌ రంజిత్‌ బోయనపల్లి తెలిపారు. 3, 6, 9, 12 నెలల సులభ వాయిదాలు ఎంచుకునే వీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ జెబియాలో 2000 నియామకాలు

‣ తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 67,820

‣ ఐటీబీపీలో 553 మెడికల్‌ స్టాఫ్‌ ఖాళీలు

Posted Date : 16-09-2021