• facebook
  • whatsapp
  • telegram

Formative‌ exams: 21 నుంచి ఫార్మెటివ్‌ పరీక్షలు 

 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వరకు ఫార్మెటివ్‌ పరీక్షలను అక్టోబ‌రు 21 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. రోజుకు రెండు పరీక్షల చొప్పున నిర్వహిస్తారు. అన్ని తరగతులు, యాజమాన్యాలకు ఒకే ప్రశ్నపత్రాన్ని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) అందిస్తుంది. పరీక్షకు గంటముందు ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాన్ని ప్రధానోపాధ్యాయులకు అందిస్తారు. ఇందులో ప్రశ్నలను ఉపాధ్యాయులు తరగతిలోని బ్లాక్‌బోర్డుపై రాయాలి. 22 నుంచి 26 వరకు ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు 27, 28 తేదీల్లో జవాబుపత్రాలను పరిశీలిస్తారు. ప్రైవేటు బడుల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కమిటీ పరిశీలిస్తుంది. 29 నుంచి నవంబరు 1 వరకు ఆన్‌లైన్‌లో మార్కులు నమోదుచేసి, తల్లిదండ్రులకు మార్కుల జాబితా అందిస్తారు. ఈ మార్కుల ఆధారంగా వెనబడిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులను ప్రారంభిస్తారు.

Posted Date : 16-10-2021