ఈనాడు, అమరావతి: ఫార్మేటివ్-2 పరీక్షల నిర్వహణలో ఉమ్మడి ప్రశ్నపత్రం విధానం గాడితప్పుతోంది. ముద్రిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో క్షేత్రస్థాయికి ఆన్లైన్లో పంపిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు వాట్సప్‌ల్లో గ్రూపుల్లోనూ ప్రత్యక్షమవుతున్నాయి. ఉపాధ్యాయులు ప్రశ్నలను బోర్డుపై రాస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 1-5 తరగతులు ఉన్నచోట బోర్డుపై ప్రశ్నలు రాసేందుకే ఎక్కువ సమయం పడుతోంది. 1, 2 తరగతులకు ఇచ్చే ప్రశ్నపత్రాల్లో బొమ్మల ఆధారంగా ప్రశ్నలు ఉండడంతో వాటిని గీసి, విద్యార్థులకు వివరించేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఫార్మేటివ్-1ను తరగతి ఆధారిత అంచనా (సీబీఏ) విధానంలో నిర్వహించారు. ఇందుకు భారీగా ఖర్చు చేశారు. ప్రశ్నపత్రాలతోపాటు ఓఎంఆర్ షీట్లను ముద్రించారు. ఇప్పుడు ఫార్మేటివ్-2కు మాత్రం ప్రశ్నపత్రాల ముద్రణ నిలిపివేశారు. జిరాక్స్ తీసుకునేందుకైనా నిధులు ఇస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.