• facebook
  • whatsapp
  • telegram

NTR Trust School: ఎన్టీఆర్‌ ట్రస్టు పాఠశాలలో ఉచిత విద్య

ఈనాడు డిజిటల్‌- అమరావతి: కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్‌ ఉన్నత పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో ఒక్కో దానిలో పది మంది చొప్పున 40 మందికి ఉచిత విద్య అందించాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబరు 22లోగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలిసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రవేశాల కంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే 25న ప్రతిభా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని సెప్టెంబరు 17న ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. అనాథ, నిరుపేదల బాలబాలికలకు ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా 2005 సంవత్సరం నుంచి ఉచిత విద్య అందిస్తున్నట్లు వివరించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ మహిళా పోలీసుల విలీనానికి త్వరలో విధివిధానాలు

‣ ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 62 పోస్టులు

Posted Date : 18-09-2021