• facebook
  • whatsapp
  • telegram

Gazetted HM: మల్టీ జోనల్‌గా గెజిటెడ్‌ హెచ్‌ఎం కొలువు

ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌లు జిల్లా స్థాయే

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ యాజమాన్యంలోని గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2 పోస్టులను మల్టీ జోనల్‌ కేడర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆగ‌స్టు 27న‌ రాత్రి మొత్తం మూడు జీఓలు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉండే జిల్లా పరిషత్తు పాఠశాలల్లోని గెజిటెడ్‌ హెచ్‌ఎం గ్రేడ్‌-2 పోస్టులను మాత్రం నిర్ధారించలేదు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు యాజమాన్యం కింద ఉండే పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ), స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ), వాటి తత్సమాన పోస్టులను జిల్లా కేడర్‌గా నిర్ణయించారు. అంతేకాకుండా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ), బీఈడీ కళాశాలలు, హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంకులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌  స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌(ఐఏఎస్‌ఈ) కళాశాలలోని అధ్యాపక పోస్టులను కూడా మల్టీ జోనల్‌గా వర్గీకరించారు.

Posted Date : 28-08-2021