• facebook
  • whatsapp
  • telegram

TS GURUKULAM: గురుకులాల ప్రారంభంపై స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వం

 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల ప్రారంభంపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. గురుకులాలు తెరవొద్దని గతంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన అంశాన్ని అక్టోబర్‌ 18న హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ మిగతా పాఠశాలలు ప్రారంభించామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిస్థితుల దృష్ట్యా పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అక్టోబర్‌ 20న పిల్‌ విచారణను పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది.

Posted Date : 18-10-2021