• facebook
  • whatsapp
  • telegram

Gurukul Schools: గురుకులాల్లో 100% హాజరుకు చర్యలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘అమ్మఒడి’ పథకం కింద సాయం విడుదలకు 75 శాతం హాజరు ఉండాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో విద్యార్థులు ఇక నుంచి క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ చర్యలు ప్రారంభించింది. అక్టోబ‌రు 18 నుంచి తరగతులు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తప్పనిసరిగా పంపాలని చెబుతున్నారు.
 

Posted Date : 18-10-2021