‘పది’లో రాణించిన విద్యార్థులు
పదోతరగతి ఫలితాల్లో బోరబండ తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసిన 69 మంది ఉత్తీర్ణులు కావడంతో ప్రిన్సిపల్ ఎన్.సుజాత కుమారి హర్షం వ్యక్తం చేశారు. బాలికల గురుకుల పాఠశాలకు చెందిన పి.నవీన, ఎం.రాజశ్రీ, ఎం.చైతన్య 9.5, ఎం.పుష్ప, కె.శివపార్వతికి 9.3 జీపీఏ సాధించారు. గురుకుల బాలుర పాఠశాలలో 97.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 84 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 82 మంది ఉత్తీర్ణత సాధించారు. 9.2 పాయింట్లతో ఎం.వెంకటేశ్ పాఠశాల టాపర్‌గా నిలిచాడని ప్రిన్సిపాల్ పి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.షేక్‌పేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల 92 శాతం ఉత్తీర్ణత నమోదు చేసింది. 73 మంది పరీక్ష రాయగా 67 మంది పాస్ అయ్యారు. ఎన్.శంకర్ అనే విద్యార్థి 10 జీపీఏ సాధించి ఉత్తమంగా నిలిచాడు.
ఉన్నత పాఠశాలలో అంతంతమాత్రం
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అంతంతమాత్రం ఫలితాలు సాధించాయి. షేక్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 50 శాతం ఉత్తీర్ణత సాధించగా, లాస్యరెడ్డి (ఆంగ్లమాధ్యం) 10 జీపీఏ సాధించింది. వెంగళరావునగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 66 శాతం, ఎల్లారెడ్డిగూడ-1 పాఠశాల 85 శాతం, హిమాయత్‌నగర్ మండలం పరిధిలో 66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బోరబండ నాట్కో పాఠశాల 68 శాతం, శ్రీరామ్‌నగర్ ప్రభుత్వ పాఠశాల 70 శాతం, యూసుఫ్‌గూడ బడిలో 98 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎర్రమంజిల్‌లోని ప్రభుత్వోన్నత పాఠశాల 70, రాజ్‌భవన్ పాఠశాలలో 76 శాతం ఉత్తీర్ణత సాధించాయి. గతి పాఠశాలలో 74 మంది పరీక్షలు రాయగా 42 మంది, ఎన్బీటీనగర్లోని పాఠశాలలో 105 మందికి 77 మంది ఉత్తీర్ణులయ్యారు. బంజారాహిల్స్ ఎన్బీటీనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి జయకృష్ణ, శ్రీసరస్వతీ ఉన్నతపాఠశాలలో విద్యనభ్యసించిన సృజన పాండే, కె.సత్యదుర్గ, పూర్ణిమ 10 జీపీఏ సాధించారు. శ్రీనగర్‌కాలనీలోని ఆశ్రయ్-ఆకృతి బధిర పాఠశాల నుంచి 16 మంది బధిర విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. వీరిలో వైష్ణవి, కళ్యాణి 9 జీపీఏతో సాధించి స్కూల్ టాపర్స్‌గా నిలిచారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.