ఈనాడు, హైదరాబాద్ - ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: అధ్యాపకులు.. సహాయ ఆచార్యుల అర్హత పరీక్ష(టీఎస్-సెట్)కు భారీ స్పందన లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఈ పరీక్షలు రాసేందుకు 50 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. మూడేళ్ల తర్వాత ఈ నోటిఫికేషన్ వెలువడడంతో వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ సమయంలో ‘సెట్’ ఉత్తీర్ణులైన వారిని పరిగణనలోకి తీసుకుంటుండడంతో ఈ పరీక్షకు ప్రాధాన్యం లభించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారి కోసం రిజిస్ట్రేషన్ ఫీజు, అపరాధ రుసుంతో మరో రెండు వారాల గడువుంది. ఫిబ్రవరి 10వరకు వేర్వేరు తేదీల్లో అపరాధ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్-సెట్ సభ్యకార్యదర్శి ప్రొ.మురళీమోహన్ తెలిపారు. జనవరి 30 వరకు రూ.1500, ఫిబ్రవరి 5 వరకు రూ.2 వేలు, 10 వరకు రూ.3 వేలు అపరాధ రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చని వివరించారు. ఆ నెల చివరి వారం నుంచే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులకు పరీక్షపై అవగాహన కల్పించేందుకు సెట్ నిర్వాహకులు 2012 నుంచి జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలు, సమాధానాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!
‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.