• facebook
  • whatsapp
  • telegram

ICET: నవంబరు 3 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌  

 

 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నవంబరు 3వ తేదీ నుంచి ఐసెట్‌-2021 కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. అక్టోబరు 27న  సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్, ఇతర సభ్యులతో సమావేశమై కౌన్సెలింగ్‌ షెడ్యూలును ఖరారు చేశారు. తొలిదశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నవంబరు 3 నుంచి 18 వరకు, తుదిదశ 21 నుంచి 28 వరకు కొనసాగుతుందని వివరించారు. ఆయా కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందిన విద్యార్థులు నవంబరు 27, 28, 29 తేదీల్లోగా సంబంధిత కళాశాలల్లో చేరాలని స్పష్టం చేశారు. స్పాట్‌ అడ్మిషన్ల విధివిధానాలు నవంబరు 28న ప్రకటిస్తామని వెల్లడించారు.

 

తొలిదశ కౌన్సెలింగ్‌ షెడ్యూలు

నవంబరు 3-9: ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, స్లాట్‌ బుకింగ్‌

నవంబరు 6-10: ధ్రువీకరణ పత్రాల పరిశీలన

నవంబరు 6-11: వెబ్‌ ఆప్షన్ల నమోదు

నవంబరు 11: వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్‌

నవంబరు 14: సీట్ల కేటాయింపు

నవంబరు 14-18: ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

 

తుదిదశ షెడ్యూలు..

నవంబరు 21: తొలిదశలో నమోదు చేసుకోలేని వారికి రిజిస్ట్రేషన్లు 

నవంబరు 22: ధ్రువీకరణ పత్రాల పరిశీలన

నవంబరు 22-23: వెబ్‌ ఆప్షన్ల నమోదు

నవంబరు 23: వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్‌

నవంబరు 26: సీట్ల కేటాయింపు

నవంబరు 26-28: ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌
 

ఐసెట్‌ - 2021 మాక్ కౌన్సెలింగ్

 

తెలంగాణ
 
ఆంధ్రప్రదేశ్‌

 


     

Posted Date : 27-10-2021