• facebook
  • whatsapp
  • telegram

IIT Kanpur: అంత‌ర్జాతీయ ఒలింపియాడ్‌లో అర్హ‌త సాధిస్తే ఐఐటీ కాన్పూర్‌లో నేరుగా సీటు!  

 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), కాన్పూర్ ఆ సంస్థ‌లో ప్ర‌వేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రకటించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి పొందిన ఒలింపియాడ్ టెస్ట్‌కు సంబంధించి వివిధ సబ్జెక్టుల్లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో నేరుగా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని, జేఈఈ ప‌రీక్ష రాసి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. అయితే, ఈ విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి తుది నిర్ణయం మాత్రం సంబంధిత విభాగాలు లేదా ఇన్‌స్టిట్యూట్ హెడ్(సెనేట్‌) అనేక కొల‌మానాల ఆధారంగా తీసుకుంటారు.

Posted Date : 20-10-2021