• facebook
  • whatsapp
  • telegram

 Fee: వెయ్యిలోపు ర్యాంకర్లకు ఫీజుల బాధ్యత మాదే

* ఐఐటీ గాంధీనగర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకర్లను ఆకర్షించేందుకు ఐఐటీలు పోటీపడుతున్నాయి. వందలోపు ర్యాంకులు పొందినవారు తమ సంస్థలో చేరితే ఫీజులతో పాటు ఇతర ఖర్చులన్నీ భరిస్తామని ఇటీవలే ఐఐటీ ఖరగ్‌పుర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఐటీ గాంధీనగర్‌(గుజరాత్‌) సైతం అదే బాటలో నడుస్తోంది. తమ సంస్థలో వెయ్యిలోపు ర్యాంకర్లు చేరితే ట్యూషన్‌ ఫీజును నాలుగేళ్లపాటు స్కాలర్‌షిప్‌ పేరిట ఇస్తామని ప్రకటించింది. ఆ సంస్థలో ట్యూషన్‌ రుసుం ఏడాదికి రూ.2లక్షలు ఉండగా...ఆ మొత్తాన్ని మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పేరిట ఇవ్వనుంది. అంటే నాలుగేళ్లలో రూ.8 లక్షలు చెల్లిస్తారు. జోసా కౌన్సెలింగ్‌ ఇప్పటికే ప్రారంభం కాగా ఈనెల 25 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈనెల 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 275 మంది వరకు వెయ్యి ర్యాంకులలోపు ఉంటారని అంచనా.
 

Posted Date : 22-10-2021