• facebook
  • whatsapp
  • telegram

IIT rankers: జేఈఈ ర్యాంకర్లకు ఏపీ సీఎం అభినందనలు

 

అమరావతి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించిన గురుకులాల విద్యార్థులను ఏపీ సీఎం జగన్ అభినందించారు. ఎస్పీ, ఎస్టీ గురుకులాల్లో చదివిన విద్యార్థులు కొందరు జాతీయ స్థాయిలో  మంచి ర్యాంకులు సాధించారు. ఈ నేపథ్యంలో వారు ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన వారికి ల్యాప్‌టాప్‌లు బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనేక మంది ఐఏఎస్ అధికారులు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే అన్నారు. అలాంటి ఐఏఎస్‌లను చూసి ఐఐటీల్లో ప్రవేశాలకు మంచి ర్యాంకులు పొందిన అభ్యర్థులు స్ఫూర్తి పొందాలన్నారు. సీఎంఓ అధికారి ముత్యాలరాజు జీవితమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యార్థులందరికీ ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

Posted Date : 26-10-2021