• facebook
  • whatsapp
  • telegram

IIT: ఐఐటీ సీట్లు 16,232

* జోసా కౌన్సెలింగ్‌ కింద 52,453 సీట్లు భర్తీ

 


ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీలో గత ఏడాది కంటే బీటెక్‌ సీట్లు స్వల్పంగా పెరిగాయి. పోయినసారి 23 ఐఐటీల్లో 16,053 ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య 16,232కు చేరుకుంది. అంటే 179 కొత్తగా పెరిగాయి. మొత్తంలో 1534 సీట్లను అమ్మాయిలకు సూపర్‌ న్యూమరరీ కింద కేటాయిస్తారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఈసారి బీటెక్‌ బయోటెక్నాలజీ అండ్‌ బయో ఇన్‌ఫర్మేటిక్స్‌, కంప్యుటేషనల్‌ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ కోర్సులు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో బ్రాంచిలో 10 చొప్పున సీట్లు ఉంటాయి. దిల్లీ ఐఐటీలో 40 సీట్లతో ఎనర్జీ ఇంజినీరింగ్‌, ఐఐటీ కాన్పుర్‌ 22 సీట్లతో స్టాటిస్టిక్స్‌ అండ్‌ డేటా సైన్స్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌) అందుబాటులోకి తెచ్చింది. మరికొన్ని ఐఐటీలు కూడా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాయి. ఫలితంగా సీట్లు పెరిగాయి. వీటితోపాటు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక సంస్థలు (గవర్నమెంట్‌ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌- జీఎఫ్‌టీఐ)ల్లో మొత్తం సీట్లు 52,453 ఉన్నాయి. వాటిని జాయిట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్‌ అక్టోబర్ 16న మొదలైంది. అక్టోబర్‌ 27న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.
 

Posted Date : 17-10-2021