రాష్ట్రంలోనే మొదటిది..
యాదగిరిగుట్ట అర్బన్, న్యూస్టుడే: శ్రీలక్ష్మీనరసింహుడు కొలువైన యాదాద్రిలో రాష్ట్రంలోనే తొలి శిల్పకళ కళాశాల ప్రారంభమైంది. డిసెంబరు 4న ఆలయ ఈవో గీత కళాశాలలో నారసింహుడికి, విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తరగతులు ప్రారంభించారు. వైటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగే ఈ కళాశాలను శిల్పకళపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఈవో భాస్కర్, కళాశాల ప్రధానోపాధ్యాయుడు మోతీలాల్, ఉపాధ్యాయులు హిమాద్రి, మాగిలి, సాంస్కృతిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానమ్మ తదితరులు పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.