• facebook
  • whatsapp
  • telegram

ఐఎన్ఐ సెట్-2021 ఫ‌లితాలు విడుద‌ల‌

 

వైద్య‌విద్యకు సంబంధించి పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వహించిన‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేష‌న‌ల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఐఎన్ఐ సెట్‌)-2021 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ప‌రీక్ష‌కు హాజ‌రైన అభ్య‌ర్థులు ఎయిమ్స్ వెబ్‌సైట్‌లో త‌మ ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు. జులై 22న ఐఎన్ఐ సెట్ జ‌రిగింది. షెడ్యూలు ప్ర‌కారం ఈ ప‌రీక్ష మే 8న జ‌ర‌గాల్సి ఉండ‌గా.. దేశంలో నెల‌కొన్న క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా వాయిదా ప‌డింది. అభ్య‌ర్థుల‌కు అనుకూలమైన ప్రాంతాల్లో కేంద్రాల‌ను ఏర్పాటు చేసి నిర్వ‌హించారు. ఐఎన్ఐ సెట్ ద్వారా మాస్ట‌ర్స్‌ ఆఫ్ స‌ర్జరీ(ఎమ్మెస్‌), డాక్ట‌ర్ ఆఫ్ మెడిసిన్‌(ఎండీ), డాక్ట‌రేట్ ఆఫ్ మెడిసిన్‌(డీఎం), మాస్ట‌ర్స్ ఆఫ్ చిరుర్జీ(ఎంసీహెచ్‌), మాస్ట‌ర్స్ ఆఫ్ డెంట‌ల్ స‌ర్జ‌రీ(ఎండీఎస్‌) కోర్సుల్లో ప్ర‌వేశం క‌ల్పిస్తారు. 

వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/

Posted Date : 27-07-2021