దిల్లీ: కేంద్ర హోం శాఖ పరిధిలోని నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,675 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ (Security Assistant/Executive) పోస్టులు 1,525 కాగా.. మల్టీ టాస్కింగ్ (Multi-Tasking Staff/) సిబ్బంది పోస్టులు 150 ఉన్నాయి. పదో తరగతి లేదా తత్సమాన కోర్సులు చేసిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేకొనేందుకు అర్హులు. తొలుత జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా కీలక మార్పులు చేశారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తుల సమయాన్ని పొడిగిస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 17లోగా దరఖాస్తులు చేసుకోచ్చని అధికారులు సూచించారు. ఎంటీఎస్ పోస్టులకు వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్లు (ఫిబ్రవరి 17 నాటికి) మించరాదు. అదే సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అయితే 27 ఏళ్లు మించరాదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో సడలింపు ఇవ్వగా.. ఓబీసీలకు మూడేళ్ల పాటు సడలిస్తారని పేర్కొన్నారు. టైర్ 1, టైర్2, టైర్ 3 దశల్లో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు రుసుము 50లు కాగా.. అదనంగా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ రూ.450లు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ప్రాంతీయ భాషలో నైపుణ్యంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తప్పనిసరిగా ఉండాలి. సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వేతన శ్రేణి రూ.21,700 నుంచి 69,100గా ఉండగా.. మల్టీ టాస్కింగ్ పోస్టులకు వేతన శ్రేణి రూ. 18 వేలు నుంచి 65,900లుగా ఉంది. దీంతో పాటు కొన్ని అలవెన్సులు కూడా అదనం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.