• facebook
  • whatsapp
  • telegram

AP Inter: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ విలీనం

ప్రక్రియ పూర్తికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ విద్యా శాఖను ప్రభుత్వం పాఠశాల విద్యలో విలీనం చేయనుంది. ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంటున్నందున భవిష్యత్తులో ఇంటర్మీడియట్‌కు బదులు +2 విధానం అమల్లోకి వస్తుంది. అందుకోసమే ఈ విలీనం చేస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం పాఠశాల, ఇంటర్మీడియట్‌ కమిషనర్లు, సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకులు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌, అకడమిక్‌, అకౌంట్స్‌ సంయుక్త కార్యదర్శి, సర్వీసెస్‌ సంయుక్త డైరెక్టర్‌, అంబేడ్కర్‌ వర్సిటీ ఉపకులపతి వెంకట్రావు, విశ్రాంత ఏడీ వీరభద్రారెడ్డితో కమిటీని ఏర్పాటు చేసింది. విలీనం ఎలా చేయాలనే దానిపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. అయితే ఇందులో ఇంటర్మీడియట్‌ నుంచి ఒక్క కమిషనర్‌ను మాత్రమే నియమించడంపై లెక్చరర్ల సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. పాఠశాల విద్యకు చెందిన అధికారుల్ని నియమించి, ఇంటర్మీడియట్‌ను విలీనం చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నాయి. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ 292 మహిళా జూనియర్‌ కళాశాలలను ప్రారంభించింది. వీటికి ఉన్నత పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లనే బోధనకు నియమించనుంది. ప్రిన్సిపల్‌ పోస్టుల్లో ప్రధానోపాధ్యాయులను నియమించాలా? ఇంటర్మీడియట్‌ విద్యలో సీనియర్లను తీసుకోవాలా? అనేదానిపై స్పష్టత లేదు.
విలీనం ఇలా..
 ఇంటర్మీడియట్‌కు ప్రస్తుతం ఉన్న కమిషనర్‌ పోస్టును డైరెక్టర్‌గా మారుస్తారు. నాన్‌ ఐఏఎస్‌ను నియమిస్తారు. ఇంటర్‌ విద్యామండలిని ప్రభుత్వ పరీక్షల విభాగంలో కలిపేస్తారు. ఇంటర్మీడియట్‌లోని విద్యా పరిశోధన, శిక్షణ మండలిని పాఠశాల విద్యలోని ఎస్‌సీఈఆర్టీలో విలీనం చేస్తారు.
 ఇంటర్‌ వృత్తి విద్యా కోర్సులను సమగ్ర శిక్ష అభియాన్‌లో నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సులకు అనుసంధానం చేస్తారు. లేదంటే నైపుణ్యాభివృద్ధి సంస్థ, పాలిటెక్నిక్‌ బోర్డుకు అప్పగిస్తారు. 
 ప్రస్తుతం పాఠశాల విద్యలో నాలుగు ప్రాంతీయ సంయుక్త సంచాలకుల పోస్టులు ఉండగా.. ఇంటర్‌లో మూడే ఉన్నాయి. ఆర్జేడీ పోస్టులను కలిపేసి, ఇద్దర్ని నియమించే అవకాశం ఉంది. ఒకరు 1-8 తరగతులకు మరొకరు 9-12 తరగతులు పర్యవేక్షించేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తడబడకుండా ప్రసంగం

‣ మరిచిపోతున్నారా... మంచిదే!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.