• facebook
  • whatsapp
  • telegram

ITI: ఐటీఐ ప్రవేశాల గడువు పొడిగింపు 

ములుగురోడ్డు, న్యూస్‌టుడే: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో ప్రవేశాల గడువు తేదీని పొడిగించినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్‌ జుమ్లానాయక్‌ తెలిపారు. అక్టోబరు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.  
టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సుల దరఖాస్తుల గడువు 15
టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సుల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి అక్టోబరు 26న తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో 22, రూ.75తో 29వ తేదీ వరకు చెల్లించాలని చెప్పారు. కోర్సులకు సంబంధించి చెల్లించాల్సిన పరీక్ష ఫీజుల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌ చూడాలని పేర్కొన్నారు. మరింత సమాచారానికి డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. 
నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షకు 22
నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిందని జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి అక్టోబరు 26న తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. నవంబర్‌ 22వ తేదిలోగా సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. అట్టి దరఖాస్తులను 24 వరకు పాఠశాలల ప్రధానాచార్యులకు అందజేయాలని సూచించారు. సమగ్ర సమాచారం కోసం డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. 
24 నుంచి డీఈఎల్‌ఈడీ పరీక్షలు
2019-20 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను నవంబరు 24 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి అక్టోబరు 26న ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పరీక్షలో తప్పిన విద్యార్థులు కూడా పరీక్షలు రాసే అవకాశం ఉందని చెప్పారు. మరింత సమాచారానికి డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Posted Date : 27-10-2021