• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ సంస్థతో జయశంకర్‌ వర్సిటీ ఒప్పందం 

 

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో కలసి పనిచేసేందుకు ‘ఆఫ్రికన్‌-ఏసియన్‌ గ్రామీణాభివృద్ధి సంస్థ’తో జయశంకర్‌ వర్సిటీ సెప్టెంబరు 20న ఒప్పందం చేసుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ సంస్థ సెక్రటరీ జనరల్‌ మనోజ్‌ నార్‌డియోసింగ్, సలహాదారు ఆర్‌.పి.సింగ్‌తో వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు, రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తమ సంస్థ ఇప్పటివరకూ 40 ఒప్పందాలు కుదుర్చుకుని, 12 దేశాల్లో 30 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటుచేసిందని మనోజ్‌ తెలిపారు. ప్రవీణ్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో రైతువేదికల్లో డిజిటల్‌ సదుపాయాలను కల్పిస్తున్నారని, వీటిని ఉపయోగించుకుని రైతులకు ఆధునిక పరిజ్ఞానంపై సమాచారం అందిస్తామని చెప్పారు. 

Posted Date : 20-09-2021