• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced: సెప్టెంబర్ 25 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డ్‌లు 

ఈ రోజు సాయంత్రం 4:00 వ‌ర‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ సెప్టెంబ‌రు 22 (ఈ రోజు) సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. సెప్టెంబరు 25 నుంచి అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.2,800. మహిళలు, రిజర్వేష‌న్ కేటగిరీ, పీడ‌బ్య్లూడీ కేటగిరీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రూ .1400 ఉంటుంది. ఫీజు చెల్లించ‌డానికి సంబంధిత వెబ్‌సైట్‌లో త‌మ అప్లికేష‌న్ నంబ‌రు, పాస్‌వ‌ర్డ్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. విజయవంతంగా నమోదు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 అడ్మిట్ కార్డును సెప్టెంబరు 25 నుంచి అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వారి దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్ నింపాల్సి ఉంటుంది.

Posted Date : 22-09-2021