• facebook
  • whatsapp
  • telegram

JEE Main 2022: వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 హాల్‌టికెట్లు

జూన్‌ 23 నుంచి 29వ తేదీ వరకు మొదటి విడత పరీక్షలు 

 

 

దిల్లీ: జేఈఈ మెయిన్ (JEE Main 2022) మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. జూన్‌ 23 నుంచి 29వ తేదీ వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 501 నగరాలతో పాటు ఇతర దేశాల్లోని 21 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకెలాంటి కొవిడ్ లక్షణాలు లేవని స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని ఎన్‌టీఏ స్పష్టంచేసింది. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునే విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 011 - 40759000 నంబర్‌ లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా సంప్రదించాలని ఎన్‌టీఏ సూచించింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు రాయనుండగా.. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు లక్షన్నర మంది ఉన్నారు.

 

కేవలం మరో రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఇప్పటివరకు అడ్మిట్ కార్డులను విడుదల చేయకపోవడంపై ఎన్టీఏ తీరుపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా ప్రవేశ పరీక్షలకు వారం పది రోజుల ముందు హాల్‌టికెట్లు జారీ చేయడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వం ఎన్‌టీఏను నెలకొల్పిన నాటి నుంచి పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు, ఫలితాల వెల్లడిలో విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోందన్న విమర్శలు చాలా వస్తున్నాయి. జూన్‌ 21 నుంచి జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు మొదలవుతాయని గతంలో ప్రకటించిన ఎన్‌టీఏ.. మూడు రోజుల క్రితం జూన్‌ 23 నుంచంటూ ప్రకటించి అయోమయానికి గురిచేసింది.  మూడు రోజుల క్రితం విద్యార్థులకు ఏ నగరం కేటాయించారో వెల్లడించినా.. పరీక్షా కేంద్రం ఏదన్నది మాత్రం తెలియకపోవడంతో విద్యార్థులు అయోమయానికి లోనయ్యారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎన్‌టీఏ ఇవాళ అడ్మిట్‌ కార్డులను విడుదల చేయడం గమనార్హం.

 

అడ్మిట్‌ కార్డును ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

తొలుత jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ని సందర్శించాలి.

అడ్మిట్ కార్డు లింక్‌పై క్లిక్‌ చేయాలి

మీ రిజస్టర్డ్‌ ఐడీ, పుట్టిన తేదీతో లాగిన్‌ అవ్వాలి.

జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది.

ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కార్డుపై మీరు, పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి. ఏదైనా సమస్య ఉంటే పైన పేర్కొన్న నంబర్‌/ఈ-మెయిల్‌ద్వారా ఎన్‌టీఏ అధికారులను సంప్రదించండి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.