• facebook
  • whatsapp
  • telegram

JEE Main: త్వరలో జేఈఈ మెయిన్‌ ప్రకటన

తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం 

 

దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2023 పరీక్ష తేదీల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్‌. వచ్చే వారం లోపే దీనికి సంబంధిచిన నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్‌ ఈ వారంలో విడుదల చేసే అవకాశంలేదని, వచ్చే వారంలో పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, జేఈఈ మెయిన్‌ 2023 తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ నవంబర్‌ 30లోగా నోటిఫికేషన్‌ వస్తే తొలి విడత పరీక్షకు వెనువెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మొదలుకానుంది. అయితే, ఈ పరీక్షకు సంబంధించి ఇటీవల ఓ ఫేక్‌ నోట్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసిన నేపథ్యంలో అప్‌డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు అధికారిక జేఈఈ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

తొలి సెషన్‌ ఏప్రిల్‌లో పెట్టాలంటూ పలువురి విజ్ఞప్తి

మరోవైపు, జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష జనవరిలో జరుగుతుందన్న వార్తలపై పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జనవరిలో నిర్వహించొద్దంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్‌టీఏ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తొలి విడత జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. జనవరి-ఫిబ్రవరిలో ఇతర పరీక్షలు ఉన్నందున రివిజన్‌కు సమయం కుదరదని పేర్కొంటున్నారు. అలాగే, 12వ తరగతి సిలబస్ కూడా ఇంకా పూర్తి కాలేదని, విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ ట్విటర్‌ వేదికగా కోరుతున్నారు. దీంతో పాటు ఈ ఏడాది అనేక బోర్డులు బోర్డు పరీక్ష ప్రాక్టికల్స్‌ కూడా జనవరిలోనే ప్రారంభిస్తున్నాయి. గతేడాది తొలి విడత జూన్‌ 20- 29 తేదీల మధ్య జరగ్గా.. రెండో సెషన్‌ పరీక్షను జులై 21- 30 తేదీల మధ్య నిర్వహించారు. ఈ రెండు విడతలకు 10.26లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 9,05,590 మంది పరీక్షలు రాసిన విషయం తెలిసిందే.

 

******************************************************************************

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్టడీమెటీరియల్

‣ గణితశాస్త్రం

‣ భౌతికశాస్త్రం

‣ రసాయనశాస్త్రం

‣ PREVIOUS PAPERS

‣ MODEL PAPERS

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.