• facebook
  • whatsapp
  • telegram

JNVST 2022  6వ తరగతి రిజిస్ట్రేష‌న్‌  ప్రారంభం

న్యూఢిల్లీ: నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) 6వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించింది. 2022-23 విద్యా సంత్స‌రానికి జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక ప‌రీక్ష‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు 2021 నవంబరు 30లోపు అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in లో నమోదు చేసుకోవచ్చు.

ఎంట్ర‌న్స్ పరీక్ష: 2022 ఏప్రిల్ 30 ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 01:30 గంటల వరకు రెండు గంటల‌పాటు ఉంటుంది.

ప‌రీక్షా విధానం: ఆబ్జెక్టివ్ తరహా 80 ప్ర‌శ్న‌లు, మూడు విభాగాల్లో 100 మార్కులకు ఉంటాయి. 

దర‌ఖాస్తుకు చివ‌రి తేది: 2021 న‌వంబ‌రు 30

అర్హత:

జ‌వ‌హ‌ర్ నవోదయ విద్యాలయం ఉన్న‌ సంబంధిత జిల్లా విద్యార్థులు మాత్ర‌మే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వ‌య‌సు: అభ్యర్థి 2009 మే 1కి ముందు, 2013 ఏప్రిల్ 30 తర్వాత జన్మించి ఉండకూడదు.

గ్రామీణ కోటా కింద ప్ర‌వేశం పొందాల‌నుకునే విద్యార్థి తప్పనిసరిగా ఆ గ్రామంలోని పాఠశాలలో విద్యా సంవ‌త్స‌రాన్ని పూర్తి చేసి ఉండాలి లేదా ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులు చదివి ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి తప్పనిసరిగా ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఎయిడెడ్ లేదా ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2021-22 విద్యా సంవ‌త్స‌రానికి 5వ‌ తరగతి చదువుతూ ఉండాలి.

 

రిజిస్ట్రేష‌న్ కోసం క్లిక్ చేయండి..

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ Give a talking to, Eat humble pie

‣ శ్రద్ధగా.. చురుగ్గా చదవలేకపోతున్నారా ?

Posted Date : 24-09-2021