• facebook
  • whatsapp
  • telegram

10,143 ఉద్యోగాల భ‌ర్తీకి జాబ్ క్యాలెండ‌ర్‌

విడుద‌ల చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్‌​​​​​​

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి జాబ్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేశారు. 2021-22 సంవ‌త్స‌రంలో 10,143 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించారు. చ‌దువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికోస‌మే జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసిన‌ట్లు సీఎం తెలిపారు. గ‌తంలో ఏ నోటిఫికేష‌న్ ఎప్పుడు వ‌స్తుందో తెలిసేది కాద‌ని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌న్నారు. వ‌చ్చే 9 నెల‌ల్లో ఏయే ఉద్యోగాలను ఎప్పుడు భ‌ర్తీ చేస్తామో ముందే చెబుతున్నామ‌న్నారు. జాబ్ క్యాలెండ‌ర్‌లో బ్యాక్‌లాక్ పోస్టులకు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు సీఎం వివ‌రించారు. దళారులు, సిఫార్సులు, పైరవీలు లేకుండా కేవలం మెరిట్‌ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని చెప్పారు. 

 

‘‘ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్లు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్‌ తీసుకొస్తున్నాం. రెండేళ్లలో ఏకంగా 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశాం. వీటిలో 1,84,264 శాశ్వత ప్రాతిపదికన, 3,99,791 పొరుగు సేవలు, 19,701 ఒప్పంద ఉద్యోగాలు ఇచ్చాం. రూ.3,500 కోట్ల భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఇచ్చాం. ఇప్పటికే ఉద్యోగులకు వేతనాలు పెంచాం’’ అని జగన్‌ అన్నారు.

 

ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో

Posted Date : 18-06-2021