• facebook
  • whatsapp
  • telegram

Job Mela: 20న మెగా ఉద్యోగ మేళా

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: జిల్లా ఉపాధి కార్యాలయం, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ,  మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆగ‌స్టు 20న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డాక్టర్‌ పి.వి.రమేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మైలవరంలోని లక్కిరెడ్డి హానిమి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే ఉద్యోగ మేళాకు 16 సంస్థల ప్రతినిధులు హాజరై 1900 ఖాళీలకు ఎంపికలు జరుపుతారన్నారు. బీపీవో, డేటా ఎంట్రీ, ఈ-కామర్స్, రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని చెఆ్పరు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ , బీటెక్‌ నుంచి పీజీ విద్యార్హుతలున్న నిరుద్యోగ యువతకు పాల్గొనవచ్చని చెప్పారు. ఆసక్తి, అర్హత కల్గిన అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీలు, చిరునామా, ఆధార్‌ కాపీలతో ఆగ‌స్టు 20న ఉదయం మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రావాలన్నారు. ఇతర వివరాలకు 8688842879, 9966090377 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అక్రిడిటేషన్‌ బోర్డులూ విలీనం!

‣ అనేక అవ‌కాశాలు అందిస్తుంది 'లా'!

‣ పొరుగుతో శాంతి నెలకొంటుందా?

‣ వసివాడుతున్న బాల్యం

‣ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.