• facebook
  • whatsapp
  • telegram

KCST: జమ్మూలో కలాం సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

జమ్మూ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధిపతి జి.సతీశ్‌ రెడ్డి అక్టోబరు 14న జమ్మూలోని కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కలాం సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (కేసీఎస్‌టీ) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది లోతైన పరిశోధనలకు కేంద్రంగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇందులో కంప్యూటేషనల్‌ సిస్టమ్స్‌ సెక్యూరిటీ, సెన్సర్లపై ప్రధాన దృష్టి ఉంటుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగాలకు మంచి ప్రాధాన్యం ఉందన్నారు. విశ్వవిద్యాలయ చరిత్రలో ఈ కేంద్రం ఒక కొత్త అధ్యాయమని వర్సిటీ ఉపకులపతి అశోక్‌ ఆయిమా తెలిపారు.  

 

Posted Date : 16-10-2021