• facebook
  • whatsapp
  • telegram

Khelo India: 13న ఖేలో ఇండియా ప్రవేశ పరీక్షలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఏలూరులోని శాయ్‌ రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా (ఎస్‌ఎల్‌కేఐ) కేంద్రంలో ప్రవేశానికి ఆగ‌స్టు 13వ తేదీన గుంటూరు జిల్లా నాగార్జుననగర్‌లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శారీరక బ్యాటరీ పరీక్షలు నిర్వహిస్తామని శాయ్‌ కేంద్రం బాధ్యుడు డీఎన్వీ వినాయకప్రసాద్‌ తెలిపారు. బ్యాటరీ పరీక్షల్లో ప్రతిభ కనబరచిన అండర్‌-14, 16, 18 బాలురకు శాయ్‌ నిబంధనల మేరకు పుష్టికరమైన ఆహారం, వసతి, స్పోర్ట్స్‌ కిట్, వ్యక్తిగత బీమా ఉచితంగా ఏర్పాటు చేయడంతో పాటు రూ.3,000 వరకు విద్యా ఫీజులు ఇస్తామన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే బాలురు పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఆధార్‌ కార్డు, క్రీడా ప్రశంసా పత్రాలు, మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, డాక్టర్‌చే ధ్రువీకరించిన ఫిట్‌నెస్‌ పత్రాలతో ఆగ‌స్టు 13వ తేదీ ఉదయం 8 గంటలకు ఆచార్య నాగార్జున వర్సిటీలోని సింథటిక్‌ ట్రాక్‌లో హాజరవ్వాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 98853 12356 నంబరుపై సంప్రదించాలన్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.