• facebook
  • whatsapp
  • telegram

KU Degree Results: కేయూ డిగ్రీ పరీక్ష ఫలితాల వెల్లడి

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది జులైలో నిర్వహించిన డిగ్రీ మూడు, ఐదు సెమిస్టర్ల పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. సెప్టెంబరు 21న కేయూ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్‌ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. వివరాలను కేయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు డాక్టర్‌ వై.వెంకయ్య, డాక్టర్‌ పి.సదానందం మంగళవారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ లాంగ్వేజెస్‌ మూడో సెమిస్టర్‌లో మొత్తం 46,201 మంది పరీక్షలు రాయగా ఇందులో 37,490 (81.15 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదో సెమిస్టర్‌లో 38,358 మందికి 34,286 (89.38 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రార్‌ ఆచార్య బైరి వెంకట్రాంరెడ్డి, క్యాంపు అధికారి డాక్టర్‌ నరేందర్‌ పాల్గొన్నారు.

https://kuexams.org/ugresults

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

Beef up, Fall apart

నాయకత్వానికి కొవిడ్‌ సెగ

Posted Date : 22-09-2021