• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 24-09-2021 (తెలుగు)

1. వాయుసేనకు 56 రవాణా విమానాలు   

పర్వత ప్రాంతాలు, ప్రతికూల పరిస్థితులు ఉండే భూభాగాల్లోకి సులువుగా సైనికులు, సామగ్రిని చేరవేసేలా భారత వైమానిక దళ రవాణా సామర్థ్యం భారీగా మెరుగుపడనుంది. 56 అధునాతన ‘సి-295’ విమానాలు మన అమ్ములపొదిలో చేరనున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. తెలంగాణలో 1,76,965 మంది దోషుల వేలిముద్రలు నిక్షిప్తం

నేరస్థుల వేలిముద్రల రికార్డు ప్రక్రియలో తెలంగాణ వేలిముద్రల విభాగం(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో) క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. దోషులను గుర్తించడంలో కీలకమైన ఈ ముద్రల నమోదులో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. 2020 చివరినాటికి ఈ విభాగం వద్ద 1,76,965 మంది వేలిముద్రలు నిక్షిప్తమై ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. జో బైడెన్‌ - నరేంద్రమోదీ భేటీ

వ్యూహాత్మక భాగసామ్యంలో భారత్, అమెరికా మైత్రీ బంధం మరింత దృఢతరం కానుంది. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. జన్యువుల పనితీరు తగ్గడంతో రుచి కోల్పోతున్న కొవిడ్‌ రోగులు 

కొవిడ్‌ రోగులు రుచి, వాసన కోల్పోవడానికి గల కారణాలను సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. రుచి, వాసన పసిగట్టే జన్యువులు మార్పులకు లోనవడమే కారణమని గమనించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చట్టవిరుద్ధం: చైనా కేంద్ర బ్యాంక్‌

బిట్‌కాయిన్, ఇతర వర్చువల్‌ కరెన్సీలతో కూడిన లావాదేవీలు చట్ట విరుద్ధమని చైనా కేంద్ర బ్యాంక్‌ ప్రకటించింది. డిజిటల్‌ కరెన్సీల అనధికార వినియోగాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

6. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.70 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్‌ 1 - సెప్టెంబరు 22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు 74 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ముందస్తు పన్ను, టీడీఎస్‌ చెల్లింపులు పెరగడం ఇందుకు దోహదపడింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలోకి వ్యక్తిగత ఆదాయ, కార్పొరేట్‌ పన్నులు వస్తాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 25-09-2021