• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 13,14-10-2021 (తెలుగు)

1. ‘పీఎం గతిశక్తి’ బృహత్‌ ప్రణాళికను ఆవిష్కరించిన మోదీ

దేశం మొత్తాన్ని రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థలతో అనుసంధానించేందుకు రూ.100 లక్షల కోట్లతో ప్రతిష్ఠాత్మక ‘పీఎం గతిశక్తి’ మాస్టర్‌ ప్లాన్‌ను దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాబోయే పాతికేళ్ల అభివృద్ధికి ఈ ప్రణాళిక ద్వారా పునాది వేస్తున్నట్లు ఉద్ఘాటించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2. ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై అర్థగణాంక శాఖ నివేదికలు

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై అర్థగణాంక శాఖ నివేదికలను విడుదల చేసింది. రాష్ట్రం సాధించిన ప్రగతిపై అర్థగణాంక, ప్రణాళికా శాఖలు తెలంగాణ ప్రయాణం(జర్నీ), రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ(స్టేట్‌ ఎకానమీ), తెలంగాణ ఆర్థిక వ్యవస్థల పేరిట ముద్రించిన మూడు పుస్తకాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆవిష్కరించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3. ఐబీఏ ఛైర్మన్‌గా ఏకే గోయల్‌ 

ది ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఛైర్మన్‌గా యూకో బ్యాంక్‌ ఎండీ ఏకే గోయల్‌ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు యూనియన్‌ బ్యాంక్‌ ఎండీ రాజ్‌కిరణ్‌ రాయ్‌ ఈ బాధ్యతల్లో ఉన్నారు. వైస్‌ ఛైర్మన్లుగా ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌కుమార్‌ ఖారా, కెనరా బ్యాంక్‌ ఎండీ ఎల్‌.వి. ప్రభాకర్, ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ రాకేశ్‌ శర్మలను ఎన్నుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

4. ఐరాస మానవ హక్కుల మండలికి భారత్‌ మరోసారి ఎన్నిక

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)లోని 18 కొత్త సభ్యుల కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. ఐరాస సర్వప్రతినిధి సభలోని 193 దేశాల్లో 184 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

5. పీలేను దాటిన సునీల్‌ ఛెత్రి 

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన వారిలో భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే (బ్రెజిల్‌)ను అధిగమించాడు. శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌లో మాల్దీవులతో మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 16-10-2021