• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 08-08-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. మనిషిని మోసుకెళ్లే డ్రోన్‌ 

మనిషిని మోసుకెళ్లగల అధునాతన ‘వరుణ’ డ్రోన్‌ భారత్‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఈ డ్రోన్‌ను తయారుచేసింది. ఇది వస్తువుల్ని, మనిషిని మోసుకెళ్లగలదు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు నాలుగో స్థానం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఈ సారి 61 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సాధించింది. 2010లో సొంతగడ్డపై జరిగిన క్రీడల్లో 38 స్వర్ణాలు సహా 101 పతకాలతో పట్టికలో మన దేశానికి రెండో స్థానం దక్కింది. 2002లో 30 స్వర్ణాలు సహా 69 పతకాలు సాధించడం తర్వాతి ఉత్తమ ప్రదర్శన. 2018 నాటి ప్రదర్శన (26 స్వర్ణాలు సహా 66 పతకాలు) మూడో స్థానంలో నిలిచింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. కేశవులుకు స్వామినాథన్‌ ఫౌండేషన్‌ పురస్కారం

తెలంగాణ‌ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కేశవులుకు అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యవసాయం, ఆహారభద్రత రంగంలో పనిచేసేవారికి ఇచ్చే ‘ఎం.ఎస్‌.స్వామినాథన్‌ అవార్డు-2022’కు కేశవులును ఎంపిక చేసింది. చెన్నైలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఈ పురస్కారాన్ని కేశవులుకు అందజేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హెచ్‌సీయూ సత్తా

ప్రతిష్ఠాత్మక నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) సత్తా చాటింది. దేశంలో విశ్వవిద్యాలయాల కేటగిరీలో ప్రథమ స్థానం దక్కించుకుంది. మొత్తమ్మీద 16వ స్థానం సాధించింది. 72 పరిశోధనపత్రాల సంఖ్య, 19.46 షేర్‌తో ఆ స్థానం దక్కించుకున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొ.బీజే రావు తెలిపారు. ఈ ర్యాంకుల్లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ తొలిస్థానంలో నిలిచింది. ఈ సంస్థ ఆచార్యులకు సంబంధించి 194 పరిశోధనపత్రాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. జాంధానీ చీరకు జాతీయ పురస్కారం

ఉప్పాడ జాంధానీ చేనేత చీరలను జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేసి విశేష ప్రతిభ కనబరిచిన కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పకు చెందిన వెంకట రామలక్ష్మి ఫ్యాబ్రిక్స్‌ సంస్థకు జాతీయ పురస్కారం లభించింది. సంస్థ అధినేత లొల్ల సత్యనారాయణ దిల్లీలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో పురస్కారం అందుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.