• facebook
  • whatsapp
  • telegram

13-06-2021 లేటెస్ట్ కరెంట్‌ అఫైర్స్‌ 

1. ముగిసిన జి-7 శిఖరాగ్ర సదస్సు

బ్రిటన్‌లోని కార్బిస్‌ బేలో జరుగుతున్న జి-7 సమావేశాల్లో భాగంగా చివరిరోజు ‘స్వేచ్ఛాయుత సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు’ పేరిట జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌లో డిజిటల్‌ సాంకేతికత విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని చెప్పారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. జమ్మూలో రూ.33.22 కోట్లతో శ్రీవారి ఆలయం 

జమ్మూ సమీపంలోని మజీన్‌ గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ జుగల్‌ కిషోర్‌ శర్మ, రామ్‌మాధవ్, తితిదే పాలక మండలి సభ్యులు గోవింద హరి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నొవాక్‌ సొంతం

ఫ్రెంచ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ 6-7 (6/8), 2-6, 6-3, 6-2, 6-4తో అయిదో సీడ్‌ స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ను ఓడించాడు. ఈ పోరులో జకో 5 ఏస్‌లతో పాటు 56 విన్నర్లు కొట్టాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. మావోయిస్టు కీలక నేత కత్తి మోహన్‌రావు మరణం

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్‌రావు(62) (ప్రకాశన్న, దామదాదా) జూన్‌ 10న దండకారణ్యంలో గుండెపోటుతో మరణించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. 38 మంది భార్యల జియోన మరణం

ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న జియోన చనా (76) మరణించారు. జియోన చనాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

6. ఇజ్రాయెల్‌ నూతన ప్రధానిగా బెన్నెట్‌

ఇజ్రాయెల్‌లో ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (71) పన్నెండేళ్ల పాలన ముగిసింది. నెతన్యాహు స్థానంలో ఒకప్పటి ఆయన అనుచరుడు నఫ్తాలీ బెన్నెట్‌ (49) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటు నెసెట్టా సమావేశమై బెన్నెట్‌ను ప్రధానిగా ఎన్నుకుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌

Posted Date : 14-06-2021