• facebook
  • whatsapp
  • telegram

26-07-2021 లేటెస్ట్ కరెంట్‌ అఫైర్స్‌ 

1. 22వ విజయ్ దివస్ 

విజయ్‌ దివస్‌ సందర్భంగా కార్గిల్‌ యుద్ధ వీరులకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లాలో ఉన్న డాగర్‌ వార్‌ మెమోరియల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. కేంద్రం నుంచి తెలంగాణకు ఏడేళ్లలో రూ.1.63 లక్షల కోట్లు

తెలంగాణకు గడిచిన ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.1,63,700 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. 2014-15 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల మధ్య పన్ను వాటా కింద రూ.99,076.21 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.64,624.78 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. దక్షిణాది ప్రఖ్యాత నటి జయంతి మరణం

దక్షిణాది చిత్రసీమలో వెలుగొందిన అందాలనటి జయంతి (76) బెంగళూరులో మరణించారు. బళ్లారిలో 1946 జనవరి 6న బాలసుబ్రహ్మణ్యం, సంతానలక్ష్మి దంపతులకు జన్మించిన జయంతి అసలు పేరు కమలాకుమారి. ఆమె కన్నడ చిత్రం జేనుగూడు (1963) ద్వారా చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. మాల్యాను దివాలాదారుగా ప్రకటించిన లండన్‌ హైకోర్టు

భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై చాలాకాలంగా న్యాయపోరాటం చేస్తున్న బ్యాంకులకు భారీ విజయం లభించింది. మాల్యా దివాలా తీసినట్లు లండన్‌ హైకోర్టు ప్రకటించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. టోక్యో ఒలింపిక్స్‌లో డియాజ్‌ సంచలనం 

టోక్యో ఒలింపిక్స్‌లో ఫిలిప్పిన్స్‌ వెయిట్‌లిఫ్టర్‌ హిడ్లీ డియాజ్‌ సంచలనం సృష్టించింది. మహిళల 55 కిలోల విభాగంలో ఒలింపిక్‌ రికార్డును సృష్టిస్తూ ఆమె పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. నాలుగో ఒలింపిక్స్‌ ఆడుతున్న 30 ఏళ్ల డియాజ్‌ మొత్తం 224 కేజీలు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మ‌రిన్ని లేటెస్ట్ క‌రెంట్ అఫైర్స్

Posted Date : 27-07-2021