• facebook
  • whatsapp
  • telegram

13-06-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. ఐఏఎస్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపకార వేతనాలు  

‣ ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరో కీలక నిర్ణయం

ముంబయి: కరోనా సంక్షోభంలో బాధితులకు అండగా నిలిచిన ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. సివిల్‌ సర్వీసులో చేరాలని కలలు కనే ఐఏఎస్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ  

‣ హోంమంత్రి మహమూద్‌ అలీ

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.కోటితో నిర్మించిన పట్టణ ఠాణా నూతన భవనాన్ని జూన్ 12న‌ ఆయన ప్రారంభించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. డిగ్రీ, పీజీ కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి  

‣ ఉన్న సీట్లలో 60 శాతం నిండితేనే

‣ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరుసగా రెండో ఏడాది కూడా ప్రైవేట్‌, ఎయిడెడ్‌ డిగ్రీ, పీజీ కళాశాలల్లో కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు, నూతన కాంబినేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. మ‌నులో అడ్మిష‌న్ల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం 

గ‌చ్చిబౌలి, న్యూస్‌టుడే: గ‌చ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీ నిర్వ‌హిస్తున్న వివిధ కోర్సుల్లో ప్ర‌వేశానికి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు జూన్ 12న 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయండి  

‣ విద్యాశాఖ మంత్రికి ట్రస్మా వినతి

ఈనాడు, హైదరాబాద్‌: నూతన విద్యా సంవత్సరానికి(2021-22) సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌తో పాటు పరీక్షల కాలపట్టికనూ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గుర్తింపు పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం

Posted Date : 13-06-2021