• facebook
  • whatsapp
  • telegram

27-06-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. అక్టోబరు 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌  

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను అక్టోబరు 3వ తేదీ (ఆదివారం) జరపనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జులై 26న‌ రాత్రి ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. మరో మూడేళ్ల వరకు మార్పు వద్దు!  

‣ ఇప్పటికిప్పుడు ఏకీకృత కౌన్సెలింగ్‌ విధానంలో చేరడం మంచిది కాదు

‣ ఎంబీబీఎస్‌, పీజీ వైద్య విద్య ప్రవేశాలపై ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ

ఈనాడు, అమరావతి: ఎంబీబీఎస్‌, పీజీ వైద్య విద్యలో ప్రవేశాలను మరో మూడేళ్ల వరకు యథాతథంగా జరపాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. ఇంటింటా ఇన్నోవేటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

‣ ఆగస్టు 10 వరకు గడువు పొడిగింపు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: విద్యార్థుల మస్తిష్కంలో మెరిసే కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏటా ‘ఇంటింటా ఇన్నోవేషన్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులే కాదు.. ఎవరైనా శాస్త్రవేత్తలుగా మారే సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. ఈఏపీసెట్‌కు 2.51లక్షల దరఖాస్తులు  

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)కు 2,51,491 దరఖాస్తులు వచ్చాయి. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుకు జులై 25న‌ అర్ధరాత్రితో గడువు ముగిసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. అమెరికా కంటే ఎక్కువగా కెన‌డాకు మన విద్యార్థులు  

‣ పర్మినెంట్‌ రెసిడెంట్‌ హోదా సులభమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: విదేశీ చదువులకు భారతీయ విద్యార్థుల తొలి గమ్యస్థానం ఏది? అని అడిగితే అమెరికా అని ఠక్కున సమాధానం ఇవ్వకండి. ఇప్పుడు ఆ స్థానాన్ని కెనడా ఆక్రమించింది మరి.. కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు అదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం

Posted Date : 27-07-2021