• facebook
  • whatsapp
  • telegram

04-08-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. గేట్‌లో పెరుగుతున్న సబ్జెక్టులు

‣ వచ్చే ఏడాదికి జీఈ, ఎన్‌ఎం అదనం

‣ 30 నుంచి దరఖాస్తుల ప్రక్రియ

ఈనాడు, హైదరాబాద్‌: గేట్‌కు ఏటా సబ్జెక్టుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులకు మరింత వెసులుబాటు ఉండనుంది. గేట్‌-2021 వరకు 27 రకాల సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలతోపాటు దేశవ్యాప్తంగా పలు జాతీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఎంటెక్‌ సీట్ల భర్తీకి గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌) చేపడతారు. 2022లో నిర్వహించే పరీక్షకు రెండు సబ్జెక్టులు- జియోమాటిక్స్‌ ఇంజినీరింగ్‌(జీఈ), నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌(ఎన్‌ఎం) అదనంగా ఉంటాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. 5 నుంచి పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరానికి 133 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 30,512 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. అందులో 780 సీట్లు ఫార్మసీ కాగా మిగిలినవి పాలిటెక్నిక్‌ సీట్లు. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 3 వేల సీట్లు తగ్గాయి. రాష్ట్రంలో 54 ప్రభుత్వ కళాశాలల్లో 12,042 సీట్లు, ఒక ఎయిడెడ్‌ కళాశాలలో 230 సీట్లు, 64 ప్రైవేట్‌ కళాశాలల్లో 17,460 సీట్లతో పాటు 14 ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా సీట్లున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. సీబీఏఎస్‌ పరీక్షలుండవు

ఈనాడు డిజిటల్, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషనరీ ఖరారు కోసం నిర్వహించే పరీక్షలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. శాఖాపరమైన పరీక్షలతోపాటు క్రెడిట్‌ బేసిడ్‌ అసెస్‌మెంట్‌ సిస్టమ్‌ (సీబీఏఎస్‌) పరీక్షలను నిర్వహించి ఉద్యోగులకు ప్రొబేషనరీని ఖరారు చేయాలని నిర్ణయించిన గ్రామ, వార్డు సచివాలయాలశాఖ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రొబేషనరీ ఖరారుకు ఏపీపీఎస్సీ నిర్వహించే శాఖాపరమైన పరీక్షలు మినహా ఎలాంటి ఇతర అదనపు పరీక్షలు ఉండబోవని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ స్పష్టం చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. పాలిసెట్‌ ప్రశ్నపత్రంలో మార్పులు

కంచరపాలెం, న్యూస్‌టుడే: సెప్టెంబ‌రు ఒకటో తేదీన జరగనున్న పాలిసెట్‌ ప్రశ్నపత్రంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు మార్పులు చేసినట్లు ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.వి.రమణ తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్‌కు జీఓ జారీచేశారన్నారు. గత ఏడాది వరకు 120 మార్కులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో గణితం 60, ఫిజిక్స్‌ 30, కెమిస్ట్రీకి 30 మార్కులుండేవని అన్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. 18 నుంచి  పీజీ పరీక్షలు

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం అందిస్తున్న రెగ్యులర్‌ పీజీ కోర్సుల్లో ఆగస్టు 18 నుంచి పరీక్షలు జరుగుతాయి. ఈమేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్‌ ఎం.సురేఖ ఆగస్టు 3న పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంటీఎం, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఎల్‌ఐఎస్సీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయని విరించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Posted Date : 04-08-2021