• facebook
  • whatsapp
  • telegram

Latest News: 28-09-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Medical Colleges: నాలుగు ప్రైవేట్‌ వైద్యకళాశాలలకు అనుమతి

ఈనాడు, వరంగల్‌: రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు ప్రైవేట్‌ వైద్య కళాశాలలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుమతిచ్చింది. హనుమకొండ జిల్లాలో ‘ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’, రంగారెడ్డి జిల్లాలోని జఫర్‌గూడలో ‘నోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌’, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని కండ్లకోయలో ‘సీఎంఆర్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’, దుండిగల్‌లో

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ICMR: చెట్ల కింద చదువులు మేలు: ఐసీఎంఆర్‌ సిఫార్సులు

ఈనాడు, దిల్లీ: రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రకృతి ఒడిలో పిల్లలకు తరగతులు చెప్పడం మంచిదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. కొవిడ్‌ మహమ్మారి కాలంలో పాఠశాలలు దీర్ఘకాలం మూసేయడం పిల్లల సంపూర్ణ వికాసంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటిని క్రమంగా తెరవడానికి ప్రయత్నించాలని సూచించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. CAT-2021: క్యాట్‌-2021కి 2.31 లక్షల మంది పోటీ

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)ల్లో ప్రవేశానికి నవంబరు 28న నిర్వహించనున్న కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(క్యాట్‌)-2021కు 2.31 లక్షల మంది పోటీపడనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Self Support Seats: విశ్వవిద్యాలయాల్లో ‘సెల్ఫ్‌ సపోర్టు సీట్లు’

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోనూ ప్రైవేటులో యాజమాన్య కోటా తరహాలో ‘సెల్ఫ్‌ సపోర్టు’ సీట్లను తీసుకొచ్చారు. వీటిల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులే బోధన రుసుంలను భరించాల్సి ఉంటుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Jobs: కొత్త ఉద్యోగాలు 3.08 కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్‌-జూన్‌లో నిర్మాణ, తయారీ, ఐటీ/బీపీఓ సహా 9 ఎంపిక చేసిన రంగాల్లో 3.08 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని కార్మిక శాఖ సర్వే వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. Aided Colleges: ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ల విలీనానికి మార్గదర్శకాలు

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌లకు గ్రాంటు నిలిపివేత, సిబ్బంది విలీనానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆస్తులతో సహా పూర్తిగా అప్పగించేందుకు ముందుకొచ్చే యాజమాన్యాల నుంచి లిఖితపూర్వక సమ్మతి తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు సూచించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7. Contract Lecturers: ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ కళాశాలల్లోని ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. సచివాలయంలో సెప్టెంబరు 27న ఆయన ఆ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

8. Promotions: దసరాలోపు ఉపాధ్యాయులకు పదోన్నతులు 

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులకు దసరాలోపు పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ జాబితాను రూపొందించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులకు కమిషనరేట్‌ ఆదేశాలు జారీ చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

9. NEET: నీట్‌-ఎస్‌ఎస్‌ సిలబస్‌లో చివరి నిమిషం మార్పులపై సుప్రీం అసంతృప్తి

దిల్లీ: అధికారం కోసం జరిగే క్రీడలో యువ వైద్యులతో ఫుట్‌బాల్‌ ఆడుకోవద్దని సోమవారం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. నీట్‌-సూపర్‌ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షల సిలబస్‌లో చివరి నిమిషంలో చేసిన మార్పులపై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా పై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Posted Date : 28-09-2021