• facebook
  • whatsapp
  • telegram

Latest News: 29-09-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. KU: వాయిదా పడిన కేయూ పరీక్షల తేదీలు ఖరారు

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబరు 27, 28వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడిన విషయం విధితమే. తిరిగి నిర్వహించే తేదీలను ఖరారు చేసి కేయూ వెబ్‌సైట్‌లో ఉంచామని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు డా.వై.వెంకయ్య, డా.పి.సదానందం సెప్టెంబరు 28న ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Contract Lecturers: కాంట్రాక్టు అధ్యాపకుల కొనసాగింపుపై జీఓ జారీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొత్తం 4,036 మంది ఒప్పంద, పొరుగుసేవల, టైమ్‌ స్కేల్‌ విధానంలో పనిచేస్తున్న అధ్యాపకులు ఈ విద్యా సంవత్సరం(2021-22) కూడా పనిచేసేందుకు(రెన్యువల్‌) ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Kaarunya Posts: ఉద్యోగంలో చేరడానికి ముందు నుంచి సీనియారిటీ వర్తించదు

దిల్లీ: ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరడానికి ముందు నుంచే పూర్వవర్తిత్వ సీనియారిటీ (రెట్రోస్పెక్టివ్‌ సీనియారిటీ) పొందడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు, నిబంధనల మేరకే ఈ సీనియారిటీని వర్తింప జేయాల్సి ఉంటుందని పేర్కొంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Navodaya: నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు 

చొప్పదండి: జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఆగస్టు 11న నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలైనట్లు ప్రధానాచార్యులు పి.మంగతాయారు ఒక ప్రకటనలో తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. AP Job Notifications: ఉద్యోగాల భర్తీకి 4 నోటిఫికేషన్ల విడుదల

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 4 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను మంగళవారం జారీ చేసింది. 39 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 11 నుంచి నవంబరు 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. PGECET: పీజీ సెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ఈనాడు, అమరావతి: పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీసెట్‌ దరఖాస్తు గడువును అక్టోబరు 6 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7. Aided Teachers: ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ ద్వారా నియామకాలు 

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వంలోకి వస్తున్న ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టులు కేటాయించనున్నట్లు సంచాలకుడు చినవీరభద్రుడు తెలిపినట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఛైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, కోఛైర్మన్లు ఎన్‌.వెంకటేశ్వర్లు, భానుమూర్తి తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

8. Inter: తొలిసారిగా అకాడమీ ఇంటర్‌ పుస్తకాల ముద్రణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా తెలుగు, సంస్కృత అకాడమీ ఇంటర్మీడియట్‌ పాఠ్య పుస్తకాలను ముద్రించిందని, లక్షల మంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

9. Schools: దసరా సెలవుల తర్వాత 3,4,5 తరగతుల విలీనం 

ఈనాడు, అమరావతి: దసరా సెలవుల తర్వాత 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 29-09-2021