• facebook
  • whatsapp
  • telegram

Latest News: 14-10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Jobs: విప్రోలో 25000 నియామకాలు 

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో కళాశాలల నుంచి 25,000 మంది తాజా ఉత్తీర్ణులను నియమించుకుంటామని విప్రో సంస్థ‌ ప్రకటించింది.  రెండో త్రైమాసికానికి సంబంధించిన స‌మావేశంలో ఈ మేర‌కు వెల్ల‌డించింది. జులై - సెప్టెంబరులో విప్రో ఏకీకృత ప్రాతిపదికన రూ.2,930.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన వర్సిటీల్లో ప్రవేశాల గడువు పెంపు 

తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, శ్రీ వేంకటేశ్వర పశువైద్య, వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు అక్టోబ‌రు 26వ తేదీ వరకు పొడిగించినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.గిరిధర్‌కృష్ణ అక్టోబ‌రు 13న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. EWS: ఇంటర్‌ స్థాయిలోనూ ఈడబ్ల్యూఎస్‌ కోటా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో వచ్చే విద్యా సంవత్సరం (2022 - 23) నుంచి ఇంటర్‌ స్థాయి కోర్సులతోపాటు మరిన్ని కోర్సుల్లో ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్‌ కోటా అమలు కానుంది. ఈసారి ఎంసెట్‌తోపాటు ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. NAT: మీ పిల్లల విద్యా సామర్థ్యం ఎంత?  

ఈనాడు, హైదరాబాద్‌: మీ పిల్లల విద్యా సామర్థ్యం ఎంత? ఏయే అంశాలపై వారికి పట్టుంది. వారి విషయ పరిజ్ఞానం ఏమిటి? అనేది తెలుసుకుంటే..భవిష్యత్తులో వాళ్లు ఏ రంగంలో రాణిస్తారో ఇట్టే అంచనా వేయవచ్చు. ఈ లక్ష్యంతోనే జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ప్రయోగాత్మకంగా ‘‘నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు(న్యాట్‌) - 2021’’కు శ్రీకారం చుట్టింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. JEE: జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: దేశంలోని ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జోసా (జాయింట్ సీట్ అలకేషన్‌) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిందని ఏపీ నిట్‌ తాడేపల్లిగూడెం డైరెక్టర్‌ సీఎస్పీ రావు అక్టోబ‌రు 13న‌ తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 14-10-2021