• facebook
  • whatsapp
  • telegram

Latest News: 16- 10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. CBSE: ఆఫ్‌లైన్‌లోనే సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల టర్మ్‌-1 పరీక్షలు 

దిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతి టర్మ్‌- 1 పరీక్షల తేదీలను అక్టోబ‌రు 18న‌  ప్రకటించనున్నారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ ఒక ప్రకటన విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Engineering: 25 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌!

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ అక్టోబ‌రు 25 నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈలోపు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఫీజుల ఖరారు, కళాశాలలకు అనుబంధ గుర్తింపు పూర్తి చేయాలని భావిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Formative‌ exams: 21 నుంచి ఫార్మెటివ్‌ పరీక్షలు 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వరకు ఫార్మెటివ్‌ పరీక్షలను అక్టోబ‌రు 21 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. రోజుకు రెండు పరీక్షల చొప్పున నిర్వహిస్తారు. అన్ని తరగతులు, యాజమాన్యాలకు ఒకే ప్రశ్నపత్రాన్ని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) అందిస్తుంది. పరీక్షకు గంటముందు ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాన్ని ప్రధానోపాధ్యాయులకు అందిస్తారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. HCL Tech: హెచ్‌సీఎల్‌ టెక్‌లో 20,000 నియామకాలు

దిల్లీ: జులై-సెప్టెంబరులో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఏకీకృత నికర లాభం రూ.3,263 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.3,146 కోట్లతో పోలిస్తే ఇది 3.7 శాతం అధికం. ఏకీకృత ఆదాయాలు రూ.18,594 కోట్ల నుంచి 11 శాతం పెరిగి రూ.20,655 కోట్లకు చేరుకున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Intigrated course: మూడేళ్ల బీఈడీ, ఎంఈడీ కోర్సు ప్రవేశపెట్టిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: ఒకేసారి బీఈడీ-ఎంఈడీ కలిపి చేసే మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈమేరకు గురువారం నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనలు- 2014ను సవరించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం

Posted Date : 16-10-2021