• facebook
  • whatsapp
  • telegram

Latest News: 23-10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. PG: తెలంగాణ‌లో పీజీ సీట్లు 49 వేలు!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఈ విద్యాసంవత్సరం మరో 8 వేలు పీజీ సీట్లు పెరగనున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Telangana Versity: తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాల రద్దు

ఈనాడు, నిజామాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు. ఎవరైనా విధులు నిర్వర్తించి ఉంటే అధికారులు సొంతంగా వేతనాలు చెల్లించాలన్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Admissions: వర్సిటీల్లో ప్రవేశాలకు 24 నుంచి రిజిస్ట్రేషన్లు

లాలాపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబ‌రు 24 నుంచి రిజిస్ట్రేషన్లు, 27 నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్‌ ప్రొ.పాండు రంగారెడ్డి అక్టోబ‌రు 23న‌ తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. OU: 27న ఉస్మానియా వర్సిటీ 81వ స్నాతకోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ ఈసారీ ఎవరికీ ఇవ్వడం లేదు. ఈ పురస్కారం అందించేందుకు ఇప్పటివరకు ప్రముఖలెవర్నీ వర్సిటీ అధికారులు ఎంపిక చేయలేదు. ఓయూ 81వ స్నాతకోత్సవం అక్టోబరు 27న జరగనుంది. దీనికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, డీఆర్డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి అతిథులుగా హాజరుకానున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Microsoft: మైక్రోసాఫ్ట్‌ ఉచిత ఉపాధి శిక్షణ

కాచిగూడ, న్యూస్‌టుడే: సామాజిక బాధ్యతలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సంస్థ గ్రేటర్‌లోని నిరుద్యోగ యువజనులకు 3 నెలల ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మాణ్‌ సంస్థ సమన్వయకర్త కె.నిరంజన్‌యాదవ్‌ తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. Results: ఏఏటీ ఫలితాల విడుదల 

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి అక్టోబరు 18న నిర్వహించిన ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ) ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ అక్టోబరు 22న రాత్రి విడుదల చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7. Inter: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు నేడు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ మొదటి, రెండు సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అక్టోబ‌రు 23న‌ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రయోగాత్మకంగా వృత్తి విద్య, కొన్ని మైనర్‌ సబ్జెక్టులను ఆన్‌లైన్‌(ఆన్‌ స్క్రీన్‌)లో మూల్యాంకనం చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

8. NTSE: జనవరిలో ఎన్‌టీఎస్‌ఈ లెవెల్‌-1 ప‌రీక్ష‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర స్థాయిలో 2021-22 విద్యా సంవత్సరానికి జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ) మొదటి లెవెల్‌ పరీక్ష వచ్చే జనవరిలో నిర్వహించనున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

9. NITW: వరంగల్‌ నిట్లో మూడు కొత్త కోర్సులు

నిట్ క్యాంపస్‌, న్యూస్‌టుడే: నూతన విద్యా విధానంలో భాగంగా వరంగల్‌ నిట్లో 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్‌ కోర్సులుగా ఎమ్మెస్సీ(మ్యాథమెటిక్స్‌), ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌), ఎమ్మెస్సీ (కెమిస్ట్ర్టీ) ప్రారంభించినట్లు నిట్ సంచాలకులు ఆచార్య ఎన్‌.వి.రమణారావు శుక్రవారం తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 23-10-2021