• facebook
  • whatsapp
  • telegram

Latest News: 28-10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. HCU: పీఎంఆర్‌ఎఫ్‌ పథకానికి 13 మంది హెచ్‌సీయూ విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి పరిశోధక ఫెలోస్‌(పీఎంఆర్‌ఎఫ్‌) పథకానికి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Scholarships: ఉపకారవేతన దరఖాస్తు గడువు పొడిగింపు?

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపకారవేతనాలు, బోధన ఫీజుల దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించనుంది. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎస్సీ సంక్షేమశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2021-22 విద్యాసంవత్సరానికి ఉపకార గడువు అక్టోబరు 24తో ముగిసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Degree Results: శాతవాహన వర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు ప్రకటించింది. అక్టోబరు 27న ఉపకులపతి ఆచార్య ఎస్‌.మల్లేశ్, పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగ ప్రసాద్, ఓఎస్‌డీ వి.రమేశ్‌లతో కలిసి ఫలితాలను విడుదల చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. SVU: ఎస్వీయూ ఎంసీఏ ఫలితాల విడుదల 

తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం): శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంసీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను అక్టోబరు 27న విడుదల చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Distance Education: బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్యలో నవంబర్‌ 3లోపు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ దూర విద్య విశ్వవిద్యాలయంలో స్పెషల్‌ బీఈడీ ప్రవేశ పరీక్ష రాసి, అర్హత సాధించిన విద్యార్థులు నవంబర్‌ 3వ తేదీలోపు తమ పేర్లను ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కృష్ణా డిగ్రీ కళాశాలలో.... 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. Entrance Exam: సైనిక పాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు పెంపు

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: అఖిలభారత సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును నవంబరు 5 వరకు పొడిగించినట్లు విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ లెఫ్టినెంట్‌ కమాండర్‌ అభిలాష్‌ బాలచంద్రన్‌ తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7. APSET: 31న ఏపీసెట్‌ ప్రవేశ పరీక్ష

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్‌-2021 అక్టోబరు 31న నిర్వహిస్తున్నట్లు ఏపీ సెట్‌ సభ్య కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

8. OU: ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వండి: గవర్నర్‌ తమిళిసై 

ఈనాడు, హైదరాబాద్‌, ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: విద్యార్థులు ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. నిత్యం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూనే సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 28-10-2021