• facebook
  • whatsapp
  • telegram

Latest News: 29-06-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. IIT Hyderabad: 5జీ టెక్నాల‌జీలో సర్టిఫికెట్‌ ప్రోగ్రాం

ఈనాడు, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌, వైసిగ్‌ అంకుర సంస్థలు కలిసి సరికొత్త సర్టిఫికెట్‌ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ‘భవిష్యత్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌’ అంశం ఆధారంగా 12 నెలల కాలవ్యవధితో కూడిన కోర్సులా దీనిని రూపొందించాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Gurukuls: గురుకులాల్లో అతిథి టీచర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం 

జియాగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ జిల్లాలో మహాత్మా జ్యోతిబాఫులేే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గెస్ట్‌ టీచర్లుగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ పేర్కొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. TS POLYCET: పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష రేపు

హబ్సిగూడ, న్యూస్‌టుడే: ఉప్పల్‌ సర్కిల్‌లో జూన్‌ 30న పాలిసెట్‌ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామంతాపూర్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్, సమన్వయకర్త వినయ్‌కుమార్‌ జూన్‌ 28న ఒక ప్రకటనలో తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Training: ఫైర్, హెల్త్‌ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణ

అంబర్‌పేట, న్యూస్‌టుడే: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైర్, సేఫ్టీ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో ఫైర్, హెల్త్‌ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. జూన్‌ 28న అంబర్‌పేటలో ఆయన మాట్లాడారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. B.ed, LLB Fees: బీఈడీ, ఎల్‌ఎల్‌బీకి గరిష్ఠ ఫీజు రూ.36 వేలు

ఈనాడు, హైదరాబాద్‌: బీఈడీ, ఎల్‌ఎల్‌బీకి గరిష్ఠ ఫీజు రూ.36 వేలుగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ఖరారు చేసింది. కనిష్ఠంగా రూ.20 వేలు ఉంటుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. BRAOU: ‘ఎంబీఏ’ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు గడువు జులై 26 

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) ప్రవేశ పరీక్ష-2022 దరఖాస్తులకు జులై 26 చివరి తేదీగా నిర్ణయించినట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులు జూన్‌ 28న తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.