1. TFRC: బీటెక్ రుసుంల నిర్ణయాధికారం మాదే
ఈనాడు, హైదరాబాద్: బీటెక్ వార్షిక రుసుంలను నిర్ణయించడంలో మాదే తుది నిర్ణయమని తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)..అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి తేల్చిచెప్పింది. ఏఐసీటీఈ సిఫారసులను అమలు చేయలేమని కుండబద్దలు కొట్టింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. IT Jobs: ఉత్కర్ష్ క్లాసెస్‌లో 500 నియామకాలు
దిల్లీ: ఎడ్టెక్ ప్లాట్పామ్ ఉత్కర్ష్ క్లాసెస్ అండ్ ఎడ్యుటెక్ ఈ ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 500 మందిని కొత్తగా నియమించుకునే ప్రణాళికలో ఉన్నట్లు గురువారం వెల్లడించింది. ఇందులో సీనియర్ లీడర్‌షిప్‌తో పాటు ఎడ్యుకేటర్లు, విక్రయాలు-వినియోగదారు సేవా జట్లు ఉంటాయని పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Fine Arts Admissions: సిరిసిల్ల ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
సిరిసిల్ల గిరిజన గురుకుల ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం బీఏ(ఇంటీరియర్ డిజైనింగ్), బీఏ(ఫ్యాషన్ డిజైనింగ్), బీఏ(ఫొటోగ్రఫీ) కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని విద్యాసంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Agnipath: అగ్నిపథ్‌కు 2.72 లక్షల దరఖాస్తులు: ఐఏఎఫ్
దిల్లీ: అగ్నిపథ్ పథకం కింద ఉద్యోగ నియామకాలకు వారం రోజుల్లో 2.72 లక్షల దరఖాస్తులు భారత వాయుసేన (ఐఏఎఫ్)కు అందినట్లు రక్షణ మంత్రిత్వశాఖ జూన్ 30న వెల్లడించింది. నమోదుకు జులై 5 చివరి తేదీ.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. VIT Entrance Exam: వీఐటీ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం
తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు(వీఐటీఈఈఈ-2022) జూన్ 30న ప్రారంభమయ్యాయి. 2022-23 విద్యా సంవత్సరానికి వెల్లూరు, చెన్నై, అమరావతి(ఆంధ్రప్రదేశ్), భోపాల్ క్యాంపస్‌లలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వీఐటీఏపీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి కోటారెడ్డి తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.